అంగరంగ వైభవంగా 13వ RVLLBS ప్రతిభా పురస్కారాలు - రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు

రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం – తెలంగాణ రాష్ట్రం వారు యువజన విభాగం ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా SSC లో ప్రతిభ కనబరిచిన వీరశైవ లింగాయత్ లింగ బలిజ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో సత్కరిస్తున్నారు.

రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు మాట్లాడుతూ, ఈ సంవత్సరం కూడా ఎస్‌ఎస్‌సీ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు 13 జూన్ 2026, శనివారం నాడు రవీంద్రభారతిలో రాష్ట్ర మరియు కేంద్ర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో ఘనంగా సత్కరించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారు, ఇతర రాజకీయ నాయకులు, విద్యావేత్తలు మరియు మేధావులు పాల్గొంటారని వెల్లడించారు.

తల్లిదండ్రులు మరియు విద్యార్థుల అభ్యర్థన మేరకు ప్రతిభా పురస్కారాలకు సంబంధించిన అర్హత ప్రమాణాల్లో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల్లో చదివి 525 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు, అలాగే CBSE లో 80 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఈ ప్రతిభా పురస్కారాలకు అర్హులని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ రాచప్ప గారు, రాష్ట్ర కోశాధికారి శ్రీ పట్లోళ్ల శివశరణ్ గారు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ పెద్దపట్ల భరత్ కుమార్ గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి విద్యుల్లత గారు, జనరల్ సెక్రటరీ శ్రీమతి అశ్విని గారు, కోశాధికారి శ్రీమతి సౌమ్య గారు, జీహెచ్‌ఎంసీ అధ్యక్షులు శ్రీ మధు గారు తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

🏆 అంగరంగ వైభవంగా "RVLLBS ఎస్‌ఎస్‌సీ ప్రతిభా పురస్కారాలు – 2026" 🏆

ప్రతిభకు పురస్కారం – విద్యకు పట్టాభిషేకం