Posts

Showing posts from May, 2026

అంగరంగ వైభవంగా 13వ RVLLBS ప్రతిభా పురస్కారాలు - రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు

Image
రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం – తెలంగాణ రాష్ట్రం వారు యువజన విభాగం ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా SSC లో ప్రతిభ కనబరిచిన వీరశైవ లింగాయత్ లింగ బలిజ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో సత్కరిస్తున్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు మాట్లాడుతూ, ఈ సంవత్సరం కూడా ఎస్‌ఎస్‌సీ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు 13 జూన్ 2026, శనివారం నాడు రవీంద్రభారతిలో రాష్ట్ర మరియు కేంద్ర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో ఘనంగా సత్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారు, ఇతర రాజకీయ నాయకులు, విద్యావేత్తలు మరియు మేధావులు పాల్గొంటారని వెల్లడించారు. తల్లిదండ్రులు మరియు విద్యార్థుల అభ్యర్థన మేరకు ప్రతిభా పురస్కారాలకు సంబంధించిన అర్హత ప్రమాణాల్లో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల్లో చదివి 525 పైగా మార్కుల...

ప్రతిభకు పురస్కారం – విద్యకు పట్టాభిషేకం

Image
హైదరాబాద్, మే 17: సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పటేల్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సంఘం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గత 13 సంవత్సరాలుగా రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్ లింగ బలిజ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో సన్మానిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జూన్ 13, 2026న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా పురస్కారాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పురస్కారాలు విద్యార్థులకు కేవలం సన్మానం మాత్రమే కాకుండా “ ప్రతిభకు పురస్కారం – విద్యకు పట్టాభిషేకం ” అనే సందేశాన్ని తెలియజేస్తాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇది ఒక ప్రేరణగా నిలుస్తుందని, వారి అభ్యున్నతికి సంఘం ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ గారు, ప్రధాన కార...
Image
    రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం - ప్రతిభా పురస్కారాలు 2026 ఓం నమశ్శివాయ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమ నిర్వహణ కోసం ₹2,500/- విరాళంగా ప్రకటించిన మన రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి శ్రీమతి  అశ్విని గారు . ఈ సందర్భంగా వారికి రాష్ట్ర యువజన విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 💐💐💐💐💐
Image
  రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం - ప్రతిభా పురస్కారాలు 2026 ఓం నమశ్శివాయ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమ నిర్వహణ కోసం ₹10,000/- విరాళంగా ప్రకటించిన మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి విద్యుత్ లత గారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర యువజన విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 💐💐💐💐💐
Image
  రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం - ప్రతిభా పురస్కారాలు 2026 ఓం నమశ్శివాయ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమ నిర్వహణ కోసం ₹5,000/- విరాళంగా ప్రకటించిన మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ కల్లపల్లి రాచప్ప గారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర యువజన విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 💐💐💐💐💐
Image
  రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం - ప్రతిభా పురస్కారాలు 2026 ఓం నమశ్శివాయ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో, యువజన విభాగం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమం కోసం, కార్యక్రమ వేదిక అయిన రవీంద్ర భారతి నిర్వహణకు సంబంధించిన మొత్తం ఖర్చును (25,000/+) మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ గారు భరించనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర యువజన విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 💐💐💐💐💐
Image
రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం - ప్రతిభా పురస్కారాలు 2026 ఓం నమశ్శివాయ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో, యువజన విభాగం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమ నిర్వహణ కోసం ₹20,000/- విరాళంగా ప్రకటించిన మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర యువజన విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 💐💐💐💐💐

📢 RVLLBS ప్రెస్ మీట్ ప్రకటన :: ఈ నెల 17న జరిగే ప్రెస్ మీట్‌కు పెద్ద ఎత్తున హాజరుకావలసిందిగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ కల్లపల్లి రాచప్ప గారు కోరుతున్నారు.

Image
 ఓం నమశ్శివాయ శరణం శరణార్థులు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో, ప్రతి సంవత్సరం రాష్ట్ర యువజన విభాగం నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన ఎస్సెస్సీ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి సంబంధించి ప్రెస్ మీట్‌ను ఈ నెల 17వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 12:00 గంటలకు, సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ గారు, కోశాధికారి శ్రీ శివశరణ్ గారు, రాష్ట్ర యువజన విభాగం, మహిళా విభాగం, జిహెచ్ఎంసి మరియు రాష్ట్ర సంఘం సభ్యులు, జిల్లా మరియు మండల కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. కావున రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘానికి చెందిన అన్ని విభాగాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని, తమ విలువైన సలహాలు మరియు సూచనలు అందించవలసిందిగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ కల్లపల్లి రాచప్ప గారు మనవి చేశారు.

RVLLBS ప్రతిభా పురస్కారాల పోస్టర్ విడుదల

Image
రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పటేల్ గారు మరియు ఇతర రాష్ట్ర ముఖ్య నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమాజానికి చెందిన విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పటేల్ గారు మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీన ప్రెస్ క్లబ్‌లో నిర్వహించబడనున్న ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రాష్ట్ర నాయకులు మరియు సభ్యులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి శివశరణ్ గారు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పెద్దపట్ల భరత్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ గారు, జిహెచ్ఎంసి అధ్యక్షులు మధు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రశాంత్ గారు, ఉమామహేశ్వర్ గారు మరియు మీడియా కమిటీ ఇంచార్జ్ మహేష్ గారు పాల్గొన్నారు.

రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం - ప్రతిభ పురస్కారాల సన్నాహక కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Image
  Date: 04-05-2026  ఓం నమశ్శివాయ శరణు శరణార్థులు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం గౌరవ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో, రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఎస్ఎస్సి ప్రతిభా పురస్కారాలపై చర్చించి, క్రింది నిర్ణయాలు తీసుకోబడినవి: తెలంగాణ రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్ లింగ బలిజ కులస్తులలో పదవ తరగతిలో: ప్రభుత్వ పాఠశాలలలో 525 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు, ప్రైవేట్ పాఠశాలలలో 540 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు, సీబీఎస్ఈలో 90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఎస్ఎస్సి ప్రతిభా పురస్కారాలు అందజేయబడును. ఈ కార్యక్రమానికి అర్హత కలిగిన విద్యార్థులు తమ వివరాలను ఈ నెల 25 మే లోపు కింద తెలిపిన ఈమెయిల్ చిరునామాకు పంపించి రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా కోరడమైనది. email id: rvllbsssc2026@gmail.com  ఎస్ఎస్సి ప్రతిభా పురస్కార కార్యక్రమానికి సంబంధించి 17 మే 2026 (ఆదివారం) నాడు, మధ్యాహ్నం 12:00 గంటలకు, Press Club, Somajiguda లో ప్రెస్ మీట్ నిర్వహించబడుతుంది. అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరడమైనది.