RVLLBS ప్రతిభా పురస్కారాల పోస్టర్ విడుదల
రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పటేల్ గారు మరియు ఇతర రాష్ట్ర ముఖ్య నాయకులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమాజానికి చెందిన విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పటేల్ గారు మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీన ప్రెస్ క్లబ్‌లో నిర్వహించబడనున్న ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రాష్ట్ర నాయకులు మరియు సభ్యులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి శివశరణ్ గారు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పెద్దపట్ల భరత్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ గారు, జిహెచ్ఎంసి అధ్యక్షులు మధు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రశాంత్ గారు, ఉమామహేశ్వర్ గారు మరియు మీడియా కమిటీ ఇంచార్జ్ మహేష్ గారు పాల్గొన్నారు.

Comments
Post a Comment