Posts

🏆 అంగరంగ వైభవంగా "RVLLBS ఎస్‌ఎస్‌సీ ప్రతిభా పురస్కారాలు – 2026" 🏆

Image
రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో "ప్రతిభా పురస్కారాలు – 2026" కార్యక్రమం ఘనంగా నిర్వహణ హైదరాబాద్‌లోని రవీంద్రభారతి లో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన "ప్రతిభా పురస్కారాలు – 2026" కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమాజానికి చెందిన ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. దాదాపు 300 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్. కృష్ణయ్య గారు, జహీరాబాద్ పార్లమెంట్ లోక్‌సభ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ షెట్కార్ గారు హాజరయ్యారు. అలాగే రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం గౌరవ అధ్యక్షులు పట్టణ సోమశేఖర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పాటిల్ గారు, ప్రధాన కార్యదర్శి రాచప్ప గారు, రాష్ట్ర కోశాధికారి శివశరణ్ గారు,క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టి శివ కుమార్ గారు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పట్లోళ్ల భరత్ కుమార్ ...

అంగరంగ వైభవంగా 13వ RVLLBS ప్రతిభా పురస్కారాలు - రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు

Image
రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం – తెలంగాణ రాష్ట్రం వారు యువజన విభాగం ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా SSC లో ప్రతిభ కనబరిచిన వీరశైవ లింగాయత్ లింగ బలిజ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో సత్కరిస్తున్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు మాట్లాడుతూ, ఈ సంవత్సరం కూడా ఎస్‌ఎస్‌సీ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు 13 జూన్ 2026, శనివారం నాడు రవీంద్రభారతిలో రాష్ట్ర మరియు కేంద్ర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో ఘనంగా సత్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారు, ఇతర రాజకీయ నాయకులు, విద్యావేత్తలు మరియు మేధావులు పాల్గొంటారని వెల్లడించారు. తల్లిదండ్రులు మరియు విద్యార్థుల అభ్యర్థన మేరకు ప్రతిభా పురస్కారాలకు సంబంధించిన అర్హత ప్రమాణాల్లో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల్లో చదివి 525 పైగా మార్కుల...

ప్రతిభకు పురస్కారం – విద్యకు పట్టాభిషేకం

Image
హైదరాబాద్, మే 17: సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పటేల్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సంఘం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గత 13 సంవత్సరాలుగా రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్ లింగ బలిజ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో సన్మానిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జూన్ 13, 2026న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా పురస్కారాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పురస్కారాలు విద్యార్థులకు కేవలం సన్మానం మాత్రమే కాకుండా “ ప్రతిభకు పురస్కారం – విద్యకు పట్టాభిషేకం ” అనే సందేశాన్ని తెలియజేస్తాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇది ఒక ప్రేరణగా నిలుస్తుందని, వారి అభ్యున్నతికి సంఘం ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ గారు, ప్రధాన కార...
Image
    రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం - ప్రతిభా పురస్కారాలు 2026 ఓం నమశ్శివాయ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమ నిర్వహణ కోసం ₹2,500/- విరాళంగా ప్రకటించిన మన రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి శ్రీమతి  అశ్విని గారు . ఈ సందర్భంగా వారికి రాష్ట్ర యువజన విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 💐💐💐💐💐
Image
  రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం - ప్రతిభా పురస్కారాలు 2026 ఓం నమశ్శివాయ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమ నిర్వహణ కోసం ₹10,000/- విరాళంగా ప్రకటించిన మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి విద్యుత్ లత గారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర యువజన విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 💐💐💐💐💐
Image
  రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం - ప్రతిభా పురస్కారాలు 2026 ఓం నమశ్శివాయ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమ నిర్వహణ కోసం ₹5,000/- విరాళంగా ప్రకటించిన మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ కల్లపల్లి రాచప్ప గారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర యువజన విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 💐💐💐💐💐
Image
  రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం - ప్రతిభా పురస్కారాలు 2026 ఓం నమశ్శివాయ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో, యువజన విభాగం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమం కోసం, కార్యక్రమ వేదిక అయిన రవీంద్ర భారతి నిర్వహణకు సంబంధించిన మొత్తం ఖర్చును (25,000/+) మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ గారు భరించనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర యువజన విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 💐💐💐💐💐