ప్రతిభకు పురస్కారం – విద్యకు పట్టాభిషేకం

హైదరాబాద్, మే 17:

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పటేల్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సంఘం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

గత 13 సంవత్సరాలుగా రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్ లింగ బలిజ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో సన్మానిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జూన్ 13, 2026న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా పురస్కారాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఈ పురస్కారాలు విద్యార్థులకు కేవలం సన్మానం మాత్రమే కాకుండా “ప్రతిభకు పురస్కారం – విద్యకు పట్టాభిషేకం” అనే సందేశాన్ని తెలియజేస్తాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇది ఒక ప్రేరణగా నిలుస్తుందని, వారి అభ్యున్నతికి సంఘం ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తుందని తెలిపారు.

రాష్ట్రంలోని అర్హులైన విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ రాచప్ప గారు, రాష్ట్ర కోశాధికారి శ్రీ పట్లోళ్ల శివశరణ్ గారు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ పెద్దపట్ల భరత్ కుమార్ గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి విద్యుల్లత గారు, జనరల్ సెక్రటరీ శ్రీమతి అశ్విని గారు, కోశాధికారి శ్రీమతి సౌమ్య గారు, జీహెచ్‌ఎంసీ అధ్యక్షులు శ్రీ మధు గారు తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

🏆 అంగరంగ వైభవంగా "RVLLBS ఎస్‌ఎస్‌సీ ప్రతిభా పురస్కారాలు – 2026" 🏆

అంగరంగ వైభవంగా 13వ RVLLBS ప్రతిభా పురస్కారాలు - రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు