రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం - ప్రతిభ పురస్కారాల సన్నాహక కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
Date: 04-05-2026
ఓం నమశ్శివాయ
శరణు శరణార్థులు
రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం గౌరవ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో, రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఎస్ఎస్సి
ప్రతిభా పురస్కారాలపై చర్చించి, క్రింది నిర్ణయాలు తీసుకోబడినవి:
తెలంగాణ రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్ లింగ బలిజ కులస్తులలో పదవ తరగతిలో:
- ప్రభుత్వ పాఠశాలలలో 525 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు,
- ప్రైవేట్ పాఠశాలలలో 540 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు,
- సీబీఎస్ఈలో 90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు
ఎస్ఎస్సి ప్రతిభా పురస్కారాలు అందజేయబడును.
ఈ కార్యక్రమానికి అర్హత కలిగిన విద్యార్థులు తమ వివరాలను ఈ నెల 25 మే లోపు కింద తెలిపిన ఈమెయిల్ చిరునామాకు పంపించి రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా కోరడమైనది.
email id: rvllbsssc2026@gmail.com
- ఎస్ఎస్సి ప్రతిభా పురస్కార కార్యక్రమానికి సంబంధించి 17 మే 2026 (ఆదివారం) నాడు,
- మధ్యాహ్నం 12:00 గంటలకు,
- Press Club, Somajiguda లో ప్రెస్ మీట్ నిర్వహించబడుతుంది.
అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరడమైనది.

Comments
Post a Comment