📢 RVLLBS ప్రెస్ మీట్ ప్రకటన :: ఈ నెల 17న జరిగే ప్రెస్ మీట్‌కు పెద్ద ఎత్తున హాజరుకావలసిందిగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ కల్లపల్లి రాచప్ప గారు కోరుతున్నారు.

 ఓం నమశ్శివాయ

శరణం శరణార్థులు

రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో, ప్రతి సంవత్సరం రాష్ట్ర యువజన విభాగం నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన ఎస్సెస్సీ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి సంబంధించి ప్రెస్ మీట్‌ను ఈ నెల 17వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 12:00 గంటలకు, సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ గారు, కోశాధికారి శ్రీ శివశరణ్ గారు, రాష్ట్ర యువజన విభాగం, మహిళా విభాగం, జిహెచ్ఎంసి మరియు రాష్ట్ర సంఘం సభ్యులు, జిల్లా మరియు మండల కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు.

కావున రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘానికి చెందిన అన్ని విభాగాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని, తమ విలువైన సలహాలు మరియు సూచనలు అందించవలసిందిగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ కల్లపల్లి రాచప్ప గారు మనవి చేశారు.

Comments

Popular posts from this blog

🏆 అంగరంగ వైభవంగా "RVLLBS ఎస్‌ఎస్‌సీ ప్రతిభా పురస్కారాలు – 2026" 🏆

అంగరంగ వైభవంగా 13వ RVLLBS ప్రతిభా పురస్కారాలు - రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు

ప్రతిభకు పురస్కారం – విద్యకు పట్టాభిషేకం